కుమారుడికి బ్లాక్ ఈగల్ డీలర్‌షిప్: మోపిదేవిపై టిడిపి

రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులకు ఒక నీతి, మంత్రికో నీతి పాటిస్తోందని వర్ల మండిపడ్డారు. పది వేలు లంచం తీసుకున్నాడని ఓ ఎక్సైజ్ సీఐని అరెస్టు చేశారని, రూ. పది లక్షలు లంచం తీసుకున్నా మంత్రిని అరెస్టు చేయలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రులను, మంత్రులు ముఖ్యమంత్రిని పరస్పరం బ్లాక్ మెయిల్ చేసుకొంటున్నారని ఆయన అన్నారు. ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. లిక్కర్ వ్యాపారి నున్న రమణకు బినామీ షాపులు ఉన్నాయని మంత్రి మోపిదేవి అంటున్నారని, తన కుటుంబ సభ్యులకు 31 షాపులు ఉన్నాయని చెప్పిన బొత్సపై కూడా రమణపై తీసుకున్న చర్యలనే తీసుకోవాలని మోపిదేవి కోరగలరా అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే వెంకట వీరయ్యకు మద్యం వ్యాపారుల నుంచి డబ్బు ముట్టినట్లు వచ్చిన ఆరోపణలపై పార్టీపరంగా విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. అయినా, ప్రతిపక్షంలో ఎమ్మెల్యేవల్ల ఏం ఉపయోగం ఉందని ఆయనకు డబ్బు ఇస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications