పోర్న్‌గేట్: కర్ణాటక మంత్రులకు శిక్ష పడుతుందా?

అశ్లీల చిత్రాలను ఎక్కడ చూశారు, ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలిగించారనే విషయాలు చట్టపరిధిలోకి రావు. చట్టంలోని లోపాలే అందుకు కారణమని నిపుణులు అంటున్నారు. బూతు చిత్రాలు చూస్తూ చట్టసభలో దొరికిపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. కర్ణాటక మంత్రులు శాసనసభలో బూతు చిత్రాలను వీక్షించడం నైతికమైన అంశం కిందికి మాత్రమే వస్తుంది. పైగా, ప్రజలకు మార్గదర్శకత్వం వహించాల్సిన నేతలు అనైతిక కార్యకలాపాలకు పాల్పపడడం ప్రశ్నార్హంగా మారింది. దానికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఇప్పటికే రాజీనామా చేశారు. వారి శానససభా సభ్యత్వాలను కూడా రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications