నన్ను లాగొద్దు: డిఎల్ రవీంద్రా రెడ్డికి మోపిదేవి సూచన

తనకు మద్దతిచ్చినందుకు డీఎల్ రవీంద్రా రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. "నన్ను మీ రాజకీయ వివాదంలోకి లాగవద్దని" మోపిదేవి డిఎల్‌కు విజ్ఞప్తి చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు రమణ చేసిన ఆరోపణలకు సంబంధించి ఏసీబీ వారు తన వైపు నుంచి వివరణ కోరాల్సి ఉందని మోపిదేవి చెప్పారు. ఏసీబీ తన వద్ద వివరణ తీసుకోకపోవడం తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజుల్లో నిజాలు బయటకు వస్తాయని, తనపై విచారణకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని, దీన్ని రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications