వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎల్ డబ్బు వ్యాఖ్యను వ్యతిరేకించిన రేణుకా చౌదరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Chowdary
న్యూఢిల్లీ: ఢిల్లీకి సూట్‌కేసులు మోసుకెళ్లి పదవులు తెచ్చుకుంటున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేసిన ప్రకటనకు కాంగ్రెసు పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. డిఎల్ వ్యాఖ్యలను ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వ్యతిరేకించారు. డిఎల్ రవీంద్రా రెడ్డి అటువంటి ప్రకటన చేయడం శోచనీయమని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ఏ సందర్భంలో ఆ మాటన్నారో తెలియదని, దానికి వివరణ ఇవ్వదలుచుకోలేదని, అయితే డబ్బులు ఇస్తే పదవులు వస్తాయనే మాట సరి కాదని ఆమె అన్నారు. సూట్‌కేసులకు తమ పార్టీ అధిష్టానం పదవులు ఇవ్వదని ఆమె స్పష్టం చేశారు.

తాను రాజ్యసభ రేసులో ఉన్నట్లు సాగుతున్న చర్చల్లో నిజం లేదని ఆమె చెప్పారు. తాను అన్ని రేసుల్లోనూ ఉన్నానని ఆమె చమత్కరించారు. తెలంగాణపై చర్చలు సాగుతున్నాయని ఆమె చెప్పారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కూడా ఖండించారు. డబ్బు సంచులు ఇస్తే పదవులు వస్తాయని అనుకోవడం పొరపాటు అని ఆయన అన్నారు. డిఎల్ చేసిన వ్యాఖ్య దురదృష్టకరమైందని ఆయన అన్నారు. అయితే, మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇచ్చారని, ఆ మేరకు మాల సామాజిక వర్గానికి కూడా ఇస్తే బాగుటుందని ఆయన అన్నారు.

English summary
AICC spokesperson Renuka Chaudhary refuted minister DL Ravindra Reddy's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X