జగన్ను బాబుతో పోల్చొద్దు:నారాయణ, ఓదార్పుపై సెటైర్

CPI Narayana
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం అన్నారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించారని, అది రాజకీయ విధానాల వైఫల్యమని అన్నారు. అదే జగన్ అవినీతి సొమ్ముతో రాజకీయ ఓదార్పు చేస్తున్నారని అన్నారు. ఈయనది అవినీతి విధానాల నేపథ్యమన్నారు. అలాంటి వారిద్దరికీ పోలిక పెట్టడం సరికాదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కర్నాటక సంగీతంలా సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. వారిద్దరినీ ఒకే ఘాటాన కట్టవద్దన్నారు.

మద్యం కుంభకోణం విషయంలోనూ నారాయణ స్పందించారు. మద్యం కుంభకోణంలో అక్రమార్కుల పేర్లు తన వద్ద లేవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దేవుడి మీద ప్రమాణం చేయాలని అన్నారు. ఇంతమంది ప్రభుత్వ విప్‌లను నియమించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను తన్నేందుకే అంతమంది విప్‌లను ముఖ్యమంత్రి నియమించినట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+