వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భోజ్‌పురి నటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ruby Singh
ముంబై: పాతికేళ్ల భోజ్‌పురి నటి రూబీ సింగ్ గోరేగావ్‌లోని తన ఫ్లాట్‌లో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని ఆమె అందులో రాసిది. తీవ్ర మానసిక ఒత్తిడితో రూబీ సింగ్ నిరుడు స్లీపింగ్ పిల్స్ మింగి బీహార్‌లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

రూబీ తల్లిదండ్రులు బీహార్‌లోని పాట్నాలో ఉంటారు. ఆమె తండ్రి పోలీసు డిప్యూటీ సూపరింటిండెంట్‌గా పని చేస్తున్నారు. రామ మందిర్ రోడ్డులోని ఎంఎంఆర్‌డిఎ కాలనీలో రూబీ ఒంటరిగానే ఉంటోంది. బీహార్‌లో రూబీ పొరుగున ఉండే రోహిత్ ఆమె శవాన్ని చూశాడు. ముంబై వచ్చినప్పుడల్లా అతను ఆమె వద్దకు వస్తుంటాడు.

రోహిత్ కూడా నటుడేనని, కాండవ్లీ హోటల్లో ఉంటున్నాడని, గురువారం అతను రూబీ ఇంటికి వచ్చాడని, ఆమె స్లీపింగ్ పిల్స్ మింగినట్లు గ్రహించాడని, ఆ విషయం రూబీ తల్లికి అతను చెప్పాడని, రూబీ తల్లితో చాలా సేపు మాట్లాడిందని, రూబీ బాగానే ఉన్నట్లు భావించి అతను వెళ్లిపోయాడని ఓ అధికారి చెప్పారు. మళ్లీ శుక్రవారం రాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో రూబీ ఇంటికి రోహిత్ వచ్చాడని, కాలింగ్ బెల్లు నొక్కితే తలుపులు తెరుచుకోలేదని, దాంతో బలవంతంగా తలుపులు తీసి లోనికి వెళ్లి చూశాడని, రూబీ దుపట్టాతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించిందని చెబుతున్నారు.

English summary
A 25-year-old Bhojpuri actress committed suicide at her rented flat in Goregaon (W) on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X