హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకోసం పార్టీ: వెనక్కి తగ్గిన టిపిఎఫ్ చైర్మన్ గద్దర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం తాను పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై ప్రజా ఫ్రంట్ చైర్మన్, ప్రజా గాయకుడు గద్దర్ వెనక్కి తగ్గారు. రాష్ట్రం కోసం కొత్త పార్టీ పొరపాటు నిర్ణయమన్నారు. శనివారం సుందరయ్య కళా భవనంలో జరిగిన కార్యవర్గ భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గద్దర్ పార్టీ నిర్ణయాన్ని కార్యవర్గ సభ్యులు వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన వెనక్కి తగ్గారని సమాచారం. పని చేసే చేతులకే మట్టి అంటుతోందని, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచనతోనే పార్టీ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డానని, కానీ అది తప్పని అంటున్నారు కాబట్టి దానిని విరమించుకుంటున్నానని చెప్పారని సమాచారం.

త్వరలో ఫ్రంట్ మహాసభను నిర్వహించనున్నారు. కాగా తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న టిడిపి తెలంగాణ ఫోరం బస్సు యాత్రను ప్రారంభించడం, మాజీ మంత్రి శంకర రావుకు ఎమ్మార్పీఎస్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడాన్ని కూడా కార్యవర్గ భేటీ తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల ఆయన ఓ టీవీ ఛానల్ ముఖాముఖిలో తెలంగాణ సాధించాలంటే కొత్త రాజకీయ శక్తి కావాలని, ఓ పార్టీ ఉండాలని చెప్పారు.

English summary
Telangana Praja Front chairman Gaddar step back on new party for Telangana by committee force.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X