కిరణ్ దారిలో జగన్, బాబు!: ట్రెండ్ మార్చిన అధి'నేతలు'

ఇక కిరణ్, జగన్ కంటే కూడా చంద్రబాబు జోరుగా యువత వైపు దూసుకు పోతున్నారు. యువతరంగం పేరిట ప్రధాన పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తన పాలనలో యువత కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. యువతకు హామీలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 33 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు. ఇన్నాళ్లూ రైతుల పేరు జపించిన మన నేతలు ఇప్పుడు యువత మంత్రం జపించడం వెనుక ఓ కారణముందంటున్నారు. సాధారణంగా రైతులు తాము ఏ పార్టీకి ఫిక్స్ అయిపోతే అదే పార్టీకి ఓటేస్తారు. కానీ యువత మాత్రం ఎప్పుడూ మార్పు కోరుకుంటుంది. అందుకే మన నేతలు వారిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications