ఆపదలో ఆదిత్యుడి వద్దకు!: అరసవల్లిలో మోపిదేవి

అంతకుముందు మద్యం సిండికేట్లపై దాడులు జరిగినప్పుడు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఆదిత్యుడిని దర్సించుకున్నారు. బొత్స లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా అరసవెల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మొత్తానికి ఆపదలో ఉన్నప్పుడు మన రాజకీయ, అధికార ప్రముఖులకు అరసవెల్లి సూర్యదేవుడు బాగానే గుర్తుకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications