జగన్ వర్గంపై చర్యలు తీసుకోవాలి: వెంకయ్యనాయుడు

కాగా అంతకుముందు రోజు శనివారం హైదరాబాదులో బిజెపి తెలంగాణ పోరు ముగింపు సభలో వెంకయ్య నాయుడు తెలంగాణపై టిడిపి, కాంగ్రెసులు తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణకు అనుకూల ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు. తర్వాత కమిటీల పేరుతో కాలయాపన చేసింది తప్ప అడుగు ముందుకు వేయలేదని విమర్శించారు. అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడ్డ రేవడిలా మారే అవకాశముందని జోస్యం చెప్పారు. టిడిపి కూడా రెండు ప్రాంతాల్లో రెండు విధానాలను అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications