గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీకి మాకినేని పెదరత్తయ్య గుడ్‌బై?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: జిల్లాలోని ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య సోమవారం ప్రత్తిపాడు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తలతో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మాకినేని పెద రత్తయ్య కొద్దికాలం క్రితం తెలుగుదేశం పార్టీ నుండి కడప పార్లమెంటు సభ్యుడు స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు. అయితే ఆయన గత కొద్దికాలంగా జగన్ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉంటూనే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సంబంధాలు నెరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రత్తిపాడు టిడిపి కార్యకర్తలతో భేటీ కావడం చర్చానీయాంసమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం లేకపోవడం వల్లనే ఆయన తిరిగి కాంగ్రెసు పార్టీలోకి రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో మొదటి విడత ఓదార్పు యాత్ర నిర్వహించిన సమయంలో మాకినేని వర్గానికి, పార్టీలోని ఇతర వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడే పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాకినేని జగన్ ఓదార్పు యాత్రకు దూరంగా ఉండిపోయారు. దీంతో ఆయన తిరిగి టిడిపిలోకి వెళ్లేందుకు దాదాపు నిర్ణయించుకున్నారనే వార్తలు అప్పుడు వినిపించాయి. ఆయనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. తాజాగా టిడిపి కార్యకర్తలతో భేటీ అయ్యారు.

English summary
It seems, former minister Makineni Peda Rathaiah will return to Telugudesam Party from YS Jagan's YSR Congress Party. He meet with Prattipadu TDP activists today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X