చిక్కుల్లో గిలానీ, నేరారోపణపై సుప్రీంకోర్టుకు హాజరు

తాజా పరిణామాలతో పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్జారీ స్విట్జర్లాండ్‌కు డబ్బులు తరలించిన కేసును తిరిగి చేపట్టాలని తాము చేసిన ఆదేశాలను గిలానీ ధక్కరించారని ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తెకార్ చౌధురి నేతృత్వంలోని సుప్రీంకోర్టు విమర్శిస్తూ కోర్టు ధిక్కరణ అభియోగం మోపింది.
గిలానీ స్వయంగా కారు నడుపుతూ సుప్రీంకోర్టుకు వచ్చారు. తన అభిమానుల వైపు చేయి ఊపుతూ ఆయన అభివాదం చేశారు. ఆ తర్వాత కోర్టు గదిలోకి వెళ్లారు. కోర్టులో అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications