ఎమ్మార్ కేసులో నా పేరు కొట్టేయండి: విజయ రాఘవన్

విల్లాల విక్రయాల్లో విజయ రాఘవన్ ప్రధాన పాత్ర పోషించారని సిబిఐ అనుమానించింది. అయితే ఛార్జీషీటులో మాత్రం ఇతని పేరును పేర్కొనలేదు. గతంలో విజయ రాఘవన్, విచారణ పేరుతో సిబిఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించిందని ప్రత్యేక కోర్టుకు తెలిపారు. విజయ రాఘవన్‌ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టును కోరిన నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గత ఐదున్నర నెలలుగా సిబిఐ రాఘవన్‌ను విచారణ పేరుతో వేధిస్తోందని అన్నారు. రాఘవన్ ఇప్పటికే తనకు తెలిసిన సమాచారమంతా అందజేశారని, ఇక రిమాండులు, అరెస్టులు అవసరం లేదన్నారు. సిబిఐ విచారణ పేరుతో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. ఆయనను మానసికంగా కూడా వేధిస్తున్నారన్నారు. తాము చెప్పింది చేయకపోవడంతోనే సిబిఐ రాఘవన్‌ను అరెస్టు చేసిందన్నారు. ఆయనను చిత్రహింసలు పెట్టిందన్నారు.












Click it and Unblock the Notifications