హైదరాబాద్: ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మంగళవారం మహిళా అధికారిణి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది యునిక్ ఐడెంటిఫిక్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఆధార్) విభాగంలో రాష్ట్ర డిప్యూటి డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి విఎస్ భాస్కర్‌పై ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అదే విభాగంలో ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తున్న పద్మజ మంగళవారం క్యాట్‌లో ఆయనపై ఫిర్యాదు చేశారు. దాంతో భాస్కర్‌ను వెంటనే బదలీ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది.
క్యాట్ ఆదేశాలపై, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసును బుధవారం విచారించనుంది. కాగా ఇతను 1985కు కేడర్ అధికారి.