వైయస్ జగన్‌కు కౌంటర్: కిరణ్ కుమార్ రెడ్డి కొత్త 'స్కీమ్'

నిరుద్యోగ భృతి పథకం కనుక కల్పిస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.ఐదువేల కోట్ల రూపాయల భారం పడుతుంది. దాదాపు 46 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుందని భావిస్తున్నారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పటికే అధికారులతో కూలంకషంగా చర్చించారని సమాచారం. గత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నగదు బదలీ పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ఈ పథకాన్ని టిడిపి 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టనుంది. జగన్ వైపు యువత మళ్లకుండా ఉండటంతో పాటు టిడిపి నగదు బదలీ పథకాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి రాజీవ్ యువకిరణాలతో యువతను, నిరుద్యోగ భృతితో నిరుద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మిగిలిన వారి కోసం ఇంకా ఏం పథకాలు తీసుకు వస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications