బతికినంత కాలం బాబు అలా చెప్పుకోవాల్సిందే: హరీష్

Harish Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలం వచ్చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప వచ్చేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు బుధవారం విమర్శించారు. సభ రెండోసారి పదిహేను నిమిషాలు వాయిదా పడింది. హరీష్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 2014 ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని బాబు చెబుతున్నారని కానీ తెలంగాణలో ఒక్క సీటు కూడా టిడిపికి వచ్చే అవకాశం లేదని హరీష్ అన్నారు. తాము అధికారంలోకి వస్తామని బాబు బతికున్నంత కాలం చెప్పుకోవాల్సిందే తప్ప వచ్చేది లేదన్నారు. తెలంగాణ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు. చరిత్రలో ఏ ప్రతిపక్షానికి జరగని అవమానం గత ఉప ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో ఓడిపోవడం, డిపాజిట్ కోల్పోవడం ద్వారా మీకు జరిగందన్నారు. బాబు కార్యకర్తలు, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారన్నారు. టిడిపి సభలో కూడా తన రెండు కళ్ల సిద్ధాంతం ప్రదర్శించిందన్నారు. తెలంగాణ పక్కదోవ పట్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు. బాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు.

టిఆర్ఎస్ పార్టీని చూపించి సభ వాయిదా వేయడం సరికాదన్నారు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని, కేంద్రం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన కూడా చేసిందన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీర్మానం పెడితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు కదా అని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు, టిడిపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రెండు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ లేనప్పుడు చర్చలో తాము భాగస్వాములం కామన్నారు.

తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, రాష్ట్రంలోని అందరూ తమ బిడ్డలేనన్న గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. గవర్నర్‌కు ఇరుప్రాంతాలు సమానమైతే ఢిల్లీ నుండి బలగాలను తెప్పించి ఉద్యమాన్ని ఎందుకు అణిచి వేయిస్తున్నారని ప్రశ్నించారు. చెరుకు సుధాకర్‌పై పెట్టిన పిడి యాక్టుపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తుంటే ఆయన మాట్లాడటం లేదన్నారు. ఆయన చిలుకపలుకులు చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+