సిఎల్పీ సమావేశానికి చిరంజీవి దూరం, ఎమ్మెల్యేలూ

శాసనసభలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు పార్టీలో సాంకేతికంగా విలీనం కాలేదు. విలీనానికి ప్రజారాజ్యం లెజిస్లేచర్ పార్టీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు గత శానససభా సమావేశాల సమయంలోనే లేఖ ఇచ్చారు. అయితే, విలీనాన్ని ఆమోదిస్తూ సిఎల్పీ తీర్మానం చేసి, స్పీకరుకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. గురువారం జరిగే సిఎల్పీ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో చిరంజీవిని శాసనసభా పక్ష ఉప నేతగా కూడా సిఎల్పీ ఎన్నుకుంటుందని అంటున్నారు. అయితే చిరంజీవి గైర్హాజరీ వల్ల అది సాధ్యమవుతుందా, లేదా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications