రూ.1.45 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: రూ. 1,45,854 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2012 - 2013 వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రతిపాదించారు. ఇది గత వార్షిక బడ్డెట్ కన్నా 15 శాతం అధికం. ప్రజలపై పన్నుల భారం వేయకుండా ఆయన బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆదాయ వనరుల సమీకరణ గణనీయంగా ఉందని ఆయన చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ వెళ్లారు. బలహీన వర్గాలకు నిధుల కేటాయింపు పెంచినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు కనిపిస్తోంది.

జాతీయ వృద్ధిరేటు కన్నా రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. వ్యవసాయ మహిళలకు మన రాష్ట్రంలోనే ఎక్కువ రుణాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పెంపుడు పథకం రాజీవ్ యువకిరణాలకు బడ్జెట్‌లో రూ. 777 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక్కో రైతుకు లక్ష రూపాయల మేరకు వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపనకు మన రాష్ట్రం అనువైందిగా చూపామని ఆయన చెప్పారు. ప్రాంతీయ విమానాశ్రయాలను పటిష్టపరుస్తామని ఆయన చెప్పారు. ఇందిర జలప్రభ కింద లక్ష బోరుబావులు వేయనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+