అరెస్టు చేసుకోండి: ప్రభుత్వానికి లోక్‌సత్తా జెపి సవాల్

రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పట్ల వీధి రౌడీలా ప్రవర్తిస్తోందన్నారు. అందుకే తాము ధాన్యాన్ని రాయచూర్ తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యామని చేతనేతే అరెస్టు చేయాలని సవాల్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలనే కొనసాగిస్తే మాత్రం తమ పోరాటం ఆగదన్నారు. రైతులు సంఘటితం కాలేరన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం తన విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు. భూకేటాయింపులపై నియమించిన సంయుక్త సభా సంఘంలో లోక్ సత్తా పార్టీకి స్థానం కల్పించినందుకు చాలామంది బాధపడుతున్నట్టుగా తెలిసిందని, తమ పార్టీ ఎవరినీ అర్థించదని, సంఖ్యాబలం ఉన్న పార్టీలు సభా సంఘంలో ఇంకా ఎక్కువ సభ్యులుండాలని కోరుకుంటుంటే తాను ఆ కమిటీ నుండి తప్పుకోవడానికి సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications