కొల్లాపూర్ పీటముడి: డికె అరుణతో చిన్నారెడ్డి ఢీ

సమావేశంలో కొల్లాపూర్ సీటుపై చిన్నారెడ్డికి, మంత్రి డికె అరుణకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. సీటు తనకే ఇవ్వాలని చిన్నారెడ్డి పట్టుబట్టగా విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలని అరుణ వాదిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి కాంగ్రెసులో చేరారు. కొల్లాపూర్ టికెట్ ఇస్తామని కాంగ్రెసులో చేరినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి హామీ ఇచ్చామని అరుణ వాదిస్తున్నారు. అరుణ, చిన్నా రెడ్డి మధ్య నెలకొన్న వివాదంతో కొల్లాపూర్ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెసు నాయకత్వానికి తలకు మించిన వ్యవహారంగానే కనిపిస్తోంది.
కాగా, తెరాస నుంచి జూపల్లి కృష్ణా రావు పోటీ చేయనున్నారు. కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి, శాసనసభా సభ్యత్వానికి జూపల్లి కృష్ణా రావు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. డికె అరుణతో కాంగ్రెసులో ఉన్నప్పుడు జూపల్లి కృష్ణా రావు బహిరంగంగానే పోరాటానికి దిగారు. గెలిచే అభ్యర్థులను తాము సమావేశంలో సూచించామని డికె అరుణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. కొల్లాపూర్‌కు విష్ణువర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూలుకు దామోదర్ రెడ్డి పేర్లను సూచించినట్లు ఆమె తెలిపారు. మహబూబ్ నగర్ సీటుపై ఇంకా నిర్ణయం జరగలేదని ఆమె తెలిపారు. కాగా, చిన్నారెడ్డి బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డిలతో విడిగా సమావేశమయ్యారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications