వేరుగా ఉండవు: జగన్ వ్యాఖ్యలకు తులసి రెడ్డి కౌంటర్

Tulasi Reddy
అనంతపురం/వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెసు పార్టీ నేత తులసి రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలో అన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని జగన్ అన్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ వేశారు. వైయస్ పథకాలు, కాంగ్రెసు పథకాలు అంటూ వేరుగా ఉండవన్నారు. పథకాలు ఏవైనా కాంగ్రెసు పార్టీయే ప్రవేశ పెడుతుందన్నారు. ఈ సంవత్సరం కేటాయింపులు గతంలో కంటే చాలా అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మినహా మరే పార్టీ కూడా దరిదాపుల్లో లేదన్నారు. కాంగ్రెసు గెలుపు ఖాయమన్నారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. చీఫ్ విప్ బాధ్యతలు చెపట్టాక ఆయన తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జనగామలో కాంగ్రెసు నేతలు గండ్రకు ఘనంగా స్వాగతం పలికారు. స్టేషన్ ఘనపూర్‌లో జరిగే ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎంపికపై సోమవారం సమావేశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+