హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం జరుగుతుంది?: జగన్ వర్గం ఎమ్మెల్యేల తలో దారి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan with Party Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంలో ఏం జరుగుతుందనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కోరకంగా ముందుకు వెళుతున్నారని చెప్పవచ్చు. తామంతా ఏకత్రాటి పైన ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ వారి తీరు మాత్రం అలా కనిపించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. విప్ ధిక్కరించిన తమపై వేటు వేయాలని కొందరు డిమాండ్ చేస్తుండగా... ఇంకొందరు అనర్హత వేటు విషయంలో కాస్త ఆలస్యం చేయమని స్పీకర్‌ను కోరుతున్నారట. మరికొందరు సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు... ఇంకొందరు కాంగ్రెసు సమావేశాలకు హాజరవుతున్నారు. నేతల తీరు చూస్తుంటే గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. విప్ ధిక్కారణపై విచారణ ప్రారంభమైనప్పటి నుండి నేతల వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు.

విచారణ సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందు వల్ల తనకు విప్ వర్తించదని చెప్పారు. ఆ తర్వాత ఆమె రాజీనామా సమర్పించారు. రాజీనామా సమర్పించిన ఆమె బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడం గమనార్హం. రాజీనామా చేసిన తర్వాత సభకు హాజరైతే అది చెల్లదు. మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి తనకు విప్ అందలేదని, తనపై వేటు వేస్తే న్యాయ పోరాటం చేస్తానని చెప్పారట. ఆయన క్రమంగా జగన్‌కు దూరమవుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఆయన న్యాయపోరాటం చేస్తానని అంటున్నారని చెబుతున్నారు. ఇక జగన్ వర్గంలో ముఖ్యమైన నేత పిల్లి సుభాష్ చంద్ర బోసు శుక్రవారం హఠాత్తుగా రాజీనామా సమర్పించారు. తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో చూపిస్తున్న వివక్ష కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి ఇటీవల సిఎల్పీ సమావేశాలకు హాజరయ్యారు. అదే సమయంలో ఆమె అంతకుముందు ఆర్మూర్‌లో జగన్ చేపట్టిన దీక్షకు హాజరు కాలేదు. గత మూడు సమావేశాలకు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. అందుకు ఆ వర్గం ఎమ్మెల్యేలు ప్రతి సమావేశానికి అందరు హాజరు కావాలని లేదు కదా అని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మాత్రం గందరగోళంగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. తాము వ్యూహాత్మకంగానే వెళుతున్నామని జగన్ వర్గం చెబుతున్నప్పటికీ విపక్షాలు వారి మాటలను కొట్టి పారేస్తున్నాయి.

English summary
It seems, some disturbance in YSR Congress party chief YS Jaganmohan Reddy camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X