ఇదే చివరి మాట చూస్తూ ఊరుకోను: రాములమ్మ

Vijayasanthi
హైదరాబాద్: మెదక్ జిల్లా అధికారులు తీరుమార్చుకోకపోతే తాను లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి శనివారం హెచ్చరించారు. సంగారెడ్డిలో జరిగిన కమిటీలో ఆమె జిల్లా పాలనా వ్యవహారాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర పథకాల గురించి కలెక్టర్ తదితర అధికారులు ఎవరూ చెప్పడం లేదన్నారు. అధికారుల వ్యవహార శైలి మారకుంటే తాను చూస్తు ఊరుకునేది లేదని, ఇదే చివరి మాట అని మరోసారి జరిగితే స్పీకర్ దృష్టికి తీసుకు పోతానని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ఏవైనా ప్రజలకు చేరాలన్నారు. కానీ జిల్లాలో మాత్రం అలా జరగడం లేదన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా తమకు పథకాలు అందడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేరుగా హైదరాబాదులో అన్నారు. టిఆర్ఎస్ భవనంలో సేవాలాల్ 273వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. తండాలపై పెత్తనం వేరేవారి చేతుల్లో ఉందన్నారు. వాటిని పంచాయతీలుగా గుర్తిస్తేనే గిరిజనులకు జరుగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+