హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ చంద్రబాబు తృతీయ ఫ్రంట్ ప్రయత్నాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం మరణశయ్యపై ఉందని, వెంటలేటర్‌పై కొన ఊపిరితో కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్తిబాబు మద్యం బాబుగా మారారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో పాత్ర ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ యువకిరణాలు కాదని, అంధకార కిరణాలని ఆయన అన్నారు. యువకిరణాలు పేరుతో హోటళ్లలో పని చేయిస్తున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో 20 మంది మంత్రులు, వంద మంది శాససభ్యులు ఉన్నారని, అందుకే మద్యం సిండికేట్లపై ఎసిబి నివేదికను ముఖ్యమంత్రి బయట పెట్టడం లేదని ఆయన అన్నారు. పదవిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆయన అన్నారు. గ్రామాల్లో 14 గంటలు విద్యుత్తు కోత విధిస్తున్నారని ఆయన విమర్శించారు.

English summary
TDP leader Gali Muddukrishnama Naidu said that Chandrababu Naidu is putting efforts to revive third front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X