తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తే నష్టమా లాభమా?

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచారంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కొవ్వూరును మినహాయిస్తే తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ప్రచారానికి చంద్రబాబు రావాలా? వద్దా? వస్తే ఏ వ్యూహంతో వెళ్లాలనే విషయంపై చర్చ జరుగుతోందని సమాచారం. తెలంగాణ విషయంలో టిడిపి రెండు కళ్ల సిద్దాంతంతో ముందుకు వెళుతోంది. ఆ అంశాన్ని పరిష్కరించాల్సింది కేంద్రమని తాము కాదని చెబుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనూ టిడిపి తెలంగాణ నేతలు తెలంగాణ కోసం, సీమాంధ్ర నేతలు మద్యం సిండికేట్ల కోసం చర్చ జరగాలని పట్టుపట్టారు. టిడిపిలోని వేర్వేరు వాదనలను విపక్షాలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నాయి.

ఇదే సమయంలో తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే స్పష్టమైన నిర్ణయం ప్రకటించనందున ప్రజలు నిలదీసే అవకాశముందని అప్పుడు ఏం సమాధానం చెప్పాలని చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల రైతు పోరు యాత్రలో చెప్పిన విధంగా తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, పరిష్కరించవలసింది కేంద్రం అని చంద్రబాబు ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తే బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. తన యాత్రలో తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు చెప్పిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని కాబట్టి అదే విషయాన్ని ఉపఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తే పార్టీకి లబ్ధి చేకూరుతుందని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

సెంటిమెంటుకు ఉప ఎన్నికలకు సంబంధం లేదనే అంశాన్ని కూడా ప్రచారంలో ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. ఇటీవల టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. సెంటిమెంటుకు ఉప ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఇక తన స్వార్థం, రాజకీయ ప్రయోజనాల కోసమే కల్వకుంట్ల చంద్రశేఖర రావు పలుమార్లు ఉప ఎన్నికలను తీసుకు వస్తున్నారనే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లాలని టిడిపి భావిస్తోంది. అంతిమంగా చంద్రబాబు ప్రచారానికి వచ్చి తాను తెలంగాణకు వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టంగా చెబితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+