సొరంగం తవ్వకాలను పరిశీలించిన మంత్రి వట్టి

హైదరాబాదులోని బిర్లా మందిర్ పరిసరాల్లో భారీగా గుప్త నిధులు ఉన్నాయన్న వార్తలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. వెంటనే పురావస్తు శాఖ రంగంలోకి దిగి తవ్వకాలు ప్రారంభించింది. గతంలో వనపర్తి రాజావారి నివాసం దానికి సమీపంలోనే ఉండేది. మూడేళ్ల కిందట పాఠశాల ఆవరణలోని మైదానం అంచున బిర్లా దేవాలయం గుట్ట కింద ఒక గోడ నిర్మిస్తుండగా పునాదుల కింద భారీ నిర్మాణాలు కనిపించాయని అంటారు. విద్యారణ్య పాఠశాలలో తన కుమారుడిని చదివిస్తున్న కోల్ ఇండియా మేనేజర్ సీతారామరాజు ఆ విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత సొరంగంలా కనిపించే అంతర్గత నిర్మాణాల 14 మెట్లు దిగి ఆయన పరిశీలించారు.












Click it and Unblock the Notifications