వైయస్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే..: జగన్ వర్గం పిల్లి

అవినీతి సొమ్ముతో స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో తాము పొత్తు పొట్టుకోమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణపై హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు విరుచుకు పడ్డారు. నారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మౌత్ పీస్‌గా మారారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఆఖరి పేజీలో వార్తలు రాసే ఆ రెండు పత్రికలు జగన్‌పై వ్యతిరేకంగా మాట్లాడితే మొదటి పేజీలో ఎందుకు వేశాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో రాసిన స్క్రిప్ట్‌ని ఈనాడు, దాని తోక పత్రికలు రాశాయని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి నారాయణ మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications