ఎన్టీఆర్ రామోజీ సంగతి తేలుస్తానన్నారు: శోభానాగిరెడ్డి

Sobha Nagi Reddy
కర్నూలు: రామోజీ రావుకు చెందిన ఈనాడు పత్రిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన శాసనసభ్యులపై అబద్దపు వార్తలు రాస్తోందని జగన్ వర్గం ప్రజారాజ్యం ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి ఆదివారం ధ్వజమెత్తారు. ఎవరి ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఈనాడు అసత్య కథనాలు రాస్తోందని ప్రశ్నించారు. తామంతా కలిసి కట్టుగా ఉన్నామని చెప్పేందుకు 18 మంది ఎమ్మెల్యేలం ఎప్పుడూ చేతిలో చేయి వేసుకొని రామోజీ ముందు కనిపించాలా అని అడిగారు. తామంతా డిస్ క్వాలిఫై అవుతామని తెలిసి కూడా జగన్ మాట మీద నిలబడి అసెంబ్లీలో టిడిపి పెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చామని అన్నారు. తమను డిస్ క్వాలిఫై చేయమని స్పీకర్‌ను కలిశామని, ఆ తర్వాత సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాతోనే వెళ్లామని ఇవన్నీ ఆ పత్రికకు కనిపించడం లేదా అన్నారు. ప్రజలను మోసగించేలా తప్పుడు వార్తలు రాసే విధానానికి రామోజీ ఇకనైనా స్వస్తీ పలకాలన్నారు.

సిబిఐ ఎల్లో మీడియాతో కుమ్మక్కై సమాచారాన్ని లీకు చేస్తూ జగన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తోందని ఆరోపించారు. మార్చి లేదా ఏప్రిల్‌లో జనగ్ జైలుకు వెళ్తారంటూ తప్పుడు రాతలు రాస్తున్నా వాటిని సిబిఐ ఎందుకు ఖండించడం లేదన్నారు. ఈ కథనాలపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. రామోజీకి తెలుగుదేశం పార్టీలోని గందరగోళం కనిపించదా అని ప్రశ్నించారు. ఇటీవల టిడిఎల్పీకి ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని అంతేకాకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఇవన్నీ ఎందుకు రాయటం లేదన్నారు. ఆ పార్టీలో సగం మంది తెలంగాణకు మద్దతంటారని మరికొంతమంది వ్యతిరేకిస్తారని ఇదంతా గందరగోళం కాదా అన్నారు.

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేమని టిడిపి, కాంగ్రెసులకు తెలిసిందన్నారు. అందుకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. ఈనాడు చెప్పింది వేదం అన్నట్లుగా ఒకప్పుడు చెల్లిందని ఇప్పుడు కాదన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను సిఎం పీఠం నుండి దించి చంద్రబాబును ఆ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఈనాడు కీలక పాత్ర పోషించిందన్నారు. కుట్రపూరిత వార్తలు రాసినందుకు ఎన్టీఆర్ అప్పుడే రామోజీపై ధ్వజమెత్తారన్నారు. ఒక పత్రికను అడ్డు పెట్టుకొని నా మీద ఇంత కుట్ర పన్నారు... నేను హైదరాబాద్ వెళ్లి రామోజీ సంగతి తేలుస్తానని ఎన్టీఆర్ అప్పుడు అన్నారని గుర్తు చేశారు. జగన్‌ను జైలులో పెడితే లాభపడాలనుకునే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+