కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, టిఆర్ఎస్ మాకు మద్దతివ్వాలి: సిపిఐ నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
కరీంనగర్: కాంగ్రెసు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని, తమ ఈ బంద్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు మద్దతివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మంగళవారం కోరారు. సిబిఐ రాష్ట్ర మహాసభలు కరీంనగర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర మహాసభల్లో సుదీర్ఘ రాజకీయ అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. తాత్కాలిక రాజకీయాలపై చర్చకు తావు లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై ఇప్పటికి ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. అది ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. తమ పార్టీ నేత బర్దన్ వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో ఆలోచించేవి అని చెప్పారు.

మద్యం మాఫియా నివేదికను ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ అవినీతిలో కొట్టుకు పోతుందన్నారు. పార్టీ మహా సభలో ప్రజా సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. తమకు రాజకీయం కంటే ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధానమన్నారు. కొన్ని అంశాలపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

English summary
CPI Narayana urged YSR Congress Party and Telangana Rastra Samithi support to their bandh call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X