హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక నుండి మద్దతివ్వం: కెసిఆర్‌కు బిజెపి కిషన్ ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం ఝలక్ ఇచ్చారు. తెలంగాణ కోసమంటూ ఇక నుండి ఎవరూ రాజీనామా చేయవద్దని, అలా చేస్తే భవిష్యత్తులో తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రస్తుతం రాజీనామా చేసిన వారు తెలంగాణ కోసమే చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అందుకే తాము పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇక నుండి రాజీనామాలు అంటే మాత్రం తమ మద్దతు ఉండదని చెప్పారు. తమ నుండి టిఆర్ఎస్ విడిపోతే బిజెపిలో కలవడానికి ఆ పార్టీ నేతలు చాలామంది వరుసలో ఉన్నారని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీలోని పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. పొత్తు లేదని తేలితే చాలామంది బిజెపిలోకి వస్తారన్నారు.

స్టేషన్ ఘనపూర్‌లో తమ పార్టీ పోటీ చేస్తే టిఆర్ఎస్ పని ఖతమన్నారు. రాజీనామాలు చేయవద్దనేదే తమ నిర్ణయమన్నారు. తెలంగాణపై తమ పార్టీ నిర్ణయం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అలాంటప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరమేమిటన్నారు. తమ పార్టీ జాతీయ పార్టీ అని, తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

English summary
BJP state president Kishan Reddy gave shock to TRS chief K Chandrasekhar Rao today. He said BJP will not support if mlas resign in future with Telangana card.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X