హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడుకు రిసెప్షన్: నారాయణ సవాల్ స్వీకరించిన ధర్మాన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana-Dharmana Prasad Rao
హైదరాబాద్: తన తనయుడి విందు విషయంలో వచ్చిన ఆరోపణలపై మంత్రి ధర్మాన ప్రసాద రావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సవాల్‌ను గురువారం స్వీకరించారు. తన తనయుడి రిసెప్షన్ కోసం విఆర్వో పరీక్ష కేంద్రం మార్పు చేశారని నారాయణ రుజువు చేస్తే తాను మంత్రి వర్గం నుండి మాత్రమే కాదని శాశ్వతంగా రాజకీయాల నుండే తప్పుకుంటానని ధర్మాన అన్నారు. ఆయన సవాల్ తాను స్వీకరిస్తున్నానని తేది, సమయం నారాయణే ప్రకటించాలన్నారు. రుజువు చేయలేని పక్షంలో తనపై అనవసర ఆరోపణలు మానుకోవాలని సూచించారు. నారాయణ ఎప్పుడైనా వచ్చి రికార్డులు పరిశీలించుకోవచ్చునని అన్నారు.

కాగా కుమారుడి పెళ్లి రిసెప్షన్ వల్ల జరిగిన సంఘటనపై ధర్మాన తనపై చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ధర్మాన ప్రసాద రావుకు ఆయన సవాల్ విసిరారు. కుమారుడి పెళ్లి రిసెప్షన్ వల్ల సెంటర్ మారడంతో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మరణించిన మాట వాస్తవమని ఆయన అన్నారు. మరణించిన వ్యక్తి రామ్మోహన్ గ్రామానికి వెళ్లి ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకుందామని ఆయన మంత్రికి సవాల్ విసిరారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పయితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నిజమని తేలితే ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ధర్మాన ప్రసాద రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. శాసనసభలో ధర్మాన అబద్దాలు చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు.

ధర్మాన కుమారుడి పెళ్లి రిసెప్షన్ కోసం శ్రీకాకుళంలోని విద్యాలయాన్ని తీసుకోవడం వల్ల వీఆర్వో పరీక్షా కేంద్రాన్ని అక్కడి నుంచి మార్చేశారని, దాని వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారని, ఓ వ్యక్తి తన కూతురును మరో కేంద్రానికి తీసుకుని వెళ్తూ ప్రమాదానికి గురై మరణించాడని నారాయణ ఆరోపించారు. ఈ విషయాన్ని చంద్రబాబు బుధవారం శాసనసభలో ప్రస్తావించినప్పుడు తీవ్ర దుమారం చెలరేగింది. నారాయణపై ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణ మీడియాలో ఓ వార్త కోసం ఏదో మాట్లాడతారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అలా మాట్లాడడమేమిటని అన్నారు.

English summary
Minister Dharmana Prasad Rao received CPI Narayana challenge today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X