కోవూరులో తెరాస పోటీ మంచి పని: లగడపాటి

కేసీఆర్‌కు ఇందులో వ్యూహం ఏమీ లేదని, సమాజ్‌వాదీ పార్టీ యూపీలో పుట్టిందని, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తోందని, బీఎస్పీ కూడా అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తోందని, రాష్ట్రాలు దాటి ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీ అయినా, ఉప ప్రాంతీయ పార్టీ అయినా రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. బలం లేకున్నా చాలామంది పోటీ చే స్తుంటారని, అలాగే టీఆర్ఎస్ కూడా పోటీ చేయవచ్చనని, కేసీఆర్ వస్తే ఎలాంటి ఆటంకం ఉండదని, ప్రచారం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
2004లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆంధ్ర, రాయలసీమల్లో పోటీ చేశారని, ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నా రని ఆయన అన్నారు. తెలంగాణలో జగన్ పోటీ చేయడం లేదని, అక్కడ బాబును అడ్డుకున్నట్లు జగన్‌ను అడ్డుకోలేదని, ఇవన్నీ చూశాక టీఆర్ఎస్‌కు, జగన్‌కు మంచి సంబంధాలు ఉ న్నాయని అనుకుంటున్నారని లగడపాటి అన్నారు.












Click it and Unblock the Notifications