నీ చరిత్రే బయటపెడతాం: కెసిఆర్‌కు తలసాని కౌంటర్

రాజం ఎవరో తెలియదని కెసిఆర్ మరోసారి బహిరంగంగా చెప్పగలడా అన్నారు. సకల జనుల సమ్మె తర్వాత నాలుగు నెలల పాటు అఙ్ఞాతంలో ఎందుకున్నావని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. రాజకీయ గురువైన మదన్ మోహన్‌ను మోసం చేయలేదా అన్నారు. నీకు మంత్రి పదవి ఇస్తే టిఆర్ఎస్ పుట్టుకొచ్చేదే కాదన్నారు. బూట్ పాలిష్ గాళ్లంటూ బజారు భాష మాట్లాడుతున్న కెసిఆర్‌కు వ్యక్తిత్వం లేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. టిడిపిలో ఉన్నప్పుడు నువ్వు అలాగే బూట్‌పాలిష్ చేశావా అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications