సుప్రీంకు శ్రీలక్ష్మిపై కీలక ఆధారం ఇచ్చిన సిబిఐ

Srilakshmi
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలైన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సిబిఐ సోమవారం సుప్రీంకోర్టుకు కీలకమైన ఆధారాలను సమర్పించింది. శ్రీలక్ష్మిపై కీలక ఆధారాలతో కూడిన సీల్డ్ కవర్‌ను సమర్పించామని సిబిఐ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ వివేక్ టంఖా న్యాయమూర్తులు హెచ్ఎల్ దత్తు, సికె ప్రసాద్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌కి విన్నవించారు. శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా పలు కీలకమైన ఆధారాలున్నాయని ఆయన చెప్పారు.

సిబిఐ సీల్డ్ కవర్‌ను సమర్పించిందని, తదుపరి విచారణ వరకు సిబిఐ సీల్డ్ కవర్‌ను తెరవడానికి వీలు లేదని సుప్రీంకోర్టు విచారణ అనంతరం చెప్పింది. సిబిఐ సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పిస్తుందని తెలిసిన శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని కోరారు. తన బెయిల్ పిటిషన్‌ను కోర్టు జనవరి 16వ తేదీన తోసి పుచ్చడంతో శ్రీలక్ష్మి మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+