బాబుకు షాక్: మద్దతివ్వలేమని తేల్చేసిన రాఘవులు

Chandrababu Naidu-BV Raghavulu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు షాక్ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వలేమని ఆయన స్పష్టం చేశారు. మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, వర్ల రామయ్య రాఘవులును కోరారు. వారిద్దరు మంగళవారం సాయంత్రం రాఘవులుతో సమావేశమయ్యారు. అయితే, రాఘవులు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు

రాష్ట్రంలోని ఏడు స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో తాము పోటీ చేస్తామని, ఉద్యమాలు చేసిన చోటల్లా తాము పోటీలో ఉంటామని రాఘవులు తెలుగుదేశం నాయకులకు చెప్పారు. మిగతా చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే వామపక్షాలు పోటీ చేస్తే ఆ పార్టీలకు మద్దతిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓ అరాచక శక్తిగా తయారైందని, ఆ పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి సిపిఎం సహకారం కోరుతున్నామని తెలుగుదేశం నాయకులు సిపిఎం నాయకులతో చెప్పారు. సిపిఎం సహకరిస్తే కెసిఆర్‌కు చెక్ పెట్టడానికి వీలవుతుందని వారు చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై రేపు బుధవారం నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలుగుదేశం నాయకులతో చెప్పారు. తాము కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+