చిరంజీవి పార్టీకి గుర్తింపా?, బ్రిటిష్ కాలం భాష: టిడిపి

శాసనసభలో మంత్రులు వాడుతున్న భాష బ్రిటిష్ కాలాన్ని గుర్తుకు చేస్తోందని మరో నేత లింగారెడ్డి అన్నారు. అనువాద పదాలు కూడా ఆయుర్వేదంలో ఔషధాల పేర్లను పోలి ఉన్నాయని ఎద్దేవా చేశారు. మంత్రులు ఉపయోగిస్తున్న భాషను మార్చి వాడుక భాషను అందుబాటులోకి తీసుకు రావాల్సిందిగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాగా మంత్రి పార్థసారథి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ పథకాలన్నీ కాంగ్రెసు నేతల కోసమేనని మంత్రి చెప్పారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పార్థసారధిపై చర్యలు తీసుకోవాలని వారు లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications
