అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య యత్నం

వారిద్దరికి తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయింది. అరుణ్ తమ మామ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి, తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌తో పాటు ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. రాజు లుంగీతో ఉరేసుకుని వేళాడుతుండడం కనిపించాడు. లక్ష్మి ప్రాణాలు విడిచి కింద పడిపోయి కనిపించింది. అతన్ని కిందికి దించి ఆస్పత్రికి చేర్చారు. అతను కోమాలోకి వెళ్లిపోయాడు.
రాజు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడని, ఆ మత్తులో భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రాజు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications