తెనాలిలో మహిళలకు వణుకు, రాత్రయితే సైకో టెర్రర్

మహిళలు ఎదురు పడగానే ఆ దుండగుడు బట్టలన్నీ విప్పేసి వారి ముందు పిచ్చిగా నృత్యం చేస్తున్నాడట. ఇరుగుపొరుగు వారు చేరుకునే లోపలే అతను కనిపించకుండా పోతున్నాడని చెబుతున్నారు. గతవారం అతను ఓ రిటైర్డ్ టీచర్ ఇంటిలోకి చొరబడి అతనిపై, అతని భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత వారి మనవరాలి గదిలోకి ప్రవేశించి బట్టలిప్పేసి డ్యాన్స్ చేస్తూ బట్టలిప్పేయాలని అతను కొట్టాడని చెబుతున్నారు.
అంతకు ముందు అతను ఓ మహిళా వసతి గృహంలో టెర్రర్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనల నేపథ్యంలో ఎస్పీ రవిచంద్ర తెనాలిలో పర్యటించారు. రాత్రి గస్తీ కోసం 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి సైకో మరో మహిళపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వీరు చేరుకునేలోగానే అతను మాయమయ్యాడు. మహిళలను భయపెడుతున్న ఆ దుండగుడికి 30 ఏళ్లుంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications