రాములమ్మ సీట్లో నేను, సంగారెడ్డి నా భార్యకు: జగ్గారెడ్డి

Jagga Reddy
హైదరాబాద్: 2014 సాధారణ ఎన్నికల్లో తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు సిద్ధమని మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గురువారం అన్నారు. తనకు మెదక్ పార్లమెంటు టిక్కెట్ కేటాయించమని పార్టీ అధిష్టానాన్ని కోరతానని ఆయన చెప్పారు. మెదక్ స్థానాన్ని కూడా కాంగ్రెసు పార్టీ కైవసం చేసుకునేందుకే తాను ఎంపిగా పోటీ చేసేందుకు సుముఖత చూపుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గం సంగారెడ్డి నుండి 2014 ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో తనను ఎవరూ ఓడించలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లి సీమాంధ్రులను రెచ్చగొట్టవద్దని సూచించారు.

తన పర్యటన ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఇరు ప్రాంతాల మధ్య గొడవలు లేపేందుకే ఆయన పర్యటిస్తున్నట్టు ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పదేపదే రాజీనామాలు చేయడం ద్వారా టిఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తే తాను స్వాగతిస్తానని చెప్పారు. అభివృద్ధి మండలి, తెలంగాణకు ప్యాకేజ్ ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా తమ జిల్లాలో ఎంపీగా పోటీ చేసేందుకు చాలామంది నేతలు క్యూలో ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు జాతీయ నేతలు వరుసలో ఉన్నారని చెప్పారు. త్వరలో అభ్యర్థిపై నిర్ణయం ప్రకటిస్తాని చెప్పారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించిన విషయం తెలిసిందే. మేకపాటి జగన్ పార్టీలోకి వెళ్లడంతో అక్కడ కాంగ్రెసు పార్టీ కొత్త అభ్యర్థిని నిలబెట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+