ఎవరీ మావోయిస్టు నేత రామకృష్ణ అలియాస్ ఆర్కె?

సాధనాల రామకృష్ణ మావోయిస్టు పార్టీలో సీనియర్ సభ్యుడు. 1979లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వరంగల్లులోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఇసి)లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్‌యులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. సాధనాల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర సాంకేతిక కమిటీ చీఫ్‌గా ఉన్నారు. మావోయిస్టులకు చెందిన ఆయుధ కర్మాగారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయని చెబుతున్నారు.
రాకెట్ లాంచర్ల తయారీలో ఆయనది అందెవేసిన చేయి అని చెబుతున్నారు. ఆయనకు సంతోష్, భాను, వినోద్ అనే మారు పేర్లున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన మల్లోజులు కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీది కూడా కరీంనగర్ జిల్లానే. కిషన్‌జీ స్థానంలో రామకృష్ణ వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications