హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అరెస్ట్‌పై ప్రచారం అవాస్తవం: వైయస్సార్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, విచారణ ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం ఉదయం ఖండించారు. జగన్‌ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం కానీ, విచారణ చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. జగన్ పైన ఉన్న కక్ష కారణంగా కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. తమ అధినేతను, తమ పార్టీని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన సోమవారం వెళ్లనున్నారని చెప్పారు. రెండుసార్లు కొవ్వూరు పర్యటన వాయిదా పడటం మామూలుగానే జరిగిందన్నారు. అందరూ ఏమనుకుంటున్నారో అది మాత్రం అవాస్తవమన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఆగిపోయారన్నారు. జగన్ దిగ్విజయంగా కొవ్వూరు, పదిహేడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారన్నారు. ఆయన పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని చెప్పారు.

జగన్ కొవ్వూరు నియోజకవర్గం పర్యటన కాకతాళీయంగా జరిగిందే కానీ అందులో ఎలాంటి విషయం లేదని మరో నేత అన్నారు. జగన్ ను చూసి అన్ని పార్టీలు గడగడలాడుతున్నాయని, అందుకే ఏదో ఒక రకంగా ఆయన ఇమేజ్ దెబ్బ తీయాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీని వీడే సమయంలోనే తనతో వచ్చే వారికి కష్టాలు ఉంటాయని జగన్ చెప్పారని గుర్తు చేశారు. జగన్ తో వచ్చే వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు వెనక్కి తగ్గరన్నారు. ఆయనపై ప్రజలకు అభిమానం ఉందన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu condemned the rumors of party chief YS Jaganmohan Reddy arrest and enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X