అర్ధరాత్రి జగన్ ఇంటి వద్ద హడావుడి, అరెస్టుపై ప్రచారం?

మరోవైపు, జగన్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల, ఆయన ఇంటి వద్దకు చేరుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. ముఖ్యంగా మహిళలను పెద్దఎత్తున తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారముందని రాసింది. కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు గడువు దగ్గర పడుతుండటంతో ముఖ్యమైన నిందితుల అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తొందని రాసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ జగన్‌తోపాటు మరికొందరు ముఖ్యులకు సిబిఐ నుంచి త్వరలో శ్రీముఖాలు అందనున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. కాగా అర్ధరాత్రి తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులకు జగన్ బయటకు వచ్చి అభివాదం చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications