జూ.ఎన్టీఆర్‌ ప్రమాదాన్ని వాడుకున్నావ్: బాబుపై అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరినైనా పక్కన పెట్టే రాక్షసుడు అన్నారు. అధికారం చేతిలోకి రాగానే స్వర్గీయ ఎన్టీఆర్ కుమారులను పక్కన పెట్టారని విమర్శించారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకోవడం శోచనీయమన్నారు. దివంగత పరిటాల రవి గొప్పవాడు అంటున్న చంద్రబాబు, నాడు అతను ఎన్టీఆర్ పక్కన ఉన్నందుకు అతని పైనా చెప్పులు వేయించలేదా అని ప్రశ్నించారు. సాక్షాత్తూ పిల్లనిచ్చిన మామే, బాబు తనకు అల్లుడైతే కావొచ్చు.. కానీ అతనో ఔరంగజేబు అని అన్నారని గుర్తు చేశారు. గత సాధారణ ఎన్నికల్లో హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చేయించుకుని, అతనికి యాక్సిడెంట్ అయ్యాక కూడా దానిని ప్రచారానికి వినియోగించుకున్నావని విమర్శించారు. బాబువి దిగజారిన, స్థాయి తక్కువ రాజకీయాలు అని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత జగన్ పైన గానీ, విజయమ్మ పైన గాని విమర్శలు చేసే స్థాయి, అర్హత బాబుకు లేవన్నారు.

వారిపై విమర్శలు చేస్తుంటే ప్రజలు చూసి బాధపడున్నారన్నారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌నే నీవు మోసం చేశావన్నారు. నీ తమ్ముడు, ఎన్టీఆర్ కుమారులు ఇలా అందరినీ మోసం చేశావని విమర్శించారు. నీకు బాంధవ్యాలు లేవన్నారు. అధికారం, డబ్బు మదంతో రాక్షసుడిగా మారావన్నారు. బాబు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. మీ అమ్మకు హైదరాబాదులో ఇల్లు, బ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. అయినా ఆ డబ్బు, ఇల్లును నీ కొడుక్కే ఎందుకిచ్చారని, రామ్మూర్తి నాయుడు తనయులకు ఎందుకివ్వలేదన్నారు. నర రూప రాక్షసుడిగా వ్యవహరించావన్నారు. కొవ్వూరు ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసులకు డిపాజిట్ కూడా రాదన్నారు. కొవ్వూరు జగన్ ప్రచారంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ప్రజలు బాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 21వ తారీఖున సిద్ధంగా ఉండని అన్నారు. బాబు అధికారం రాదనే ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని, ఆ మాటలకు అర్ధం లేకుండా పోయిందన్నారు.

ఓ సెంటిమెంట్ కారణంగా రాజీనామాలు చేశారు కాబట్టి తాము తెలంగాణలోని పోటీ పెట్టమని స్పష్టం చేశామని అన్నారు. పరకాల నియోజకవర్గం నుండి కొండా సురేఖపై పోటీ పెట్టడం పెట్టక పోవడం ఆయా పార్టీల నిర్ణయమని, తాము మాత్రం అడిగి చూస్తామని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలకు కొవ్వూరులో డిపాజిట్ వస్తే అందరం ఆశ్చర్య పోవాల్సిందేనన్నారు. తన తనయుడు లోకేష్ కుమార్ విదేశాల్లో చదివాడని, అందుకు తాను గర్వపడుతున్నానని బాబు చెప్పారని, ఇక్కడ చదివిన వారు గర్వపడ కూడదా అని ప్రశ్నించారు. ఇక్కడ చదివిన వారు విదేశాలలో మంచి మంచి స్థాయిల్లో ఉన్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+