కోవూరులో రెండు విడతలు చిరంజీవి ప్రచారం

ముఖ్యమంత్రి ఈ నెల 9వ తేదీన కోవూరులో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. తాను 11, 12 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు. ఆర్టీసిని ప్రైవేటీకరిస్తానని తాను చెప్పలేదని, సంస్థను బలోపేతం చేయడం, ప్రజలకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. మద్యం వ్యాపారంలో తన బంధువులున్నారనే విషయాన్ని తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లకు సంబంధించినవారు తన వద్ద లేరని ఆయన స్పష్టం చేశారు. మద్యం సిండికేట్లపై దర్యాప్తు సాగుతోందని, ఈ సమయంలో తాను ఎక్కువగా మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. జూన్‌లో మద్యం దుకాణాల వేలాలు జరుగుతాయని, అప్పుడు మద్యం వ్యాపారంతో తన బంధువులకు సంబంధం లేకుండా చూసుకుంటానని ఆయన చెప్పారు. విజయనగరంలోని తన ఇంటి వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేయడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications