జూ. ఎన్టీఆర్‌పై వ్యాఖ్య: చంద్రబాబుతో హరికృష్ణ రాజీ?

అవసరమైనప్పుడు పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తారని ఆయన చెప్పారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ పిలువగానే వచ్చి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తారా అనేది అనుమానమేనని అంటున్నారు. సినిమాలపై పూర్తిగా దృష్టి సారించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే స్థితిలో లేరని అంటున్నారు. ఒక రకంగా చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు కూడా ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు.
తన కుమారుడు నారా లోకేష్ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గడం వల్లనే హరికృష్ణ తన పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి, చక్రం తిప్పాలనే ఆలోచనలో కూడా లేరని అంటున్నారు. చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ రాకుండా చూసుకోవడమే ఆయన ప్రస్తుతానికి చేసే పని అంటున్నారు. అందుకు అనుగుణంగానే హరికృష్ణ ఒక ఎత్తుగడగా మాత్రమే ఆ ప్రకటన చేశారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications