మాట మార్చే కెసిఆర్‌తో కష్టం: తెరాసకు నారాయణ షాక్

CPI Narayana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మేమెక్కడ వేగుతామని, ఆయన ఉదయం ఓ మాట సాయంత్రం మరో మాట మాట్లాడతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం అన్నారు. తాము తెరాసకి మద్దతు ఇవ్వ డం కేవలం ఉప ఎన్నికల వరకేనని, 2014 ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో సిపిఐ ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తోందని, తెరాసతో కలిసి చేయదని పేర్కొన్నారు. కాగా సిపిఐతో ఇక ముందు కలిసి వెళతామని టిఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఝలక్ ఇచ్చినట్లుగా భావించవచ్చు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ రాజకీయ అజ్ఞాని అని ఆయన విమర్శించారు. నాయకత్వ లక్షణాలు, రాజకీయ పరిజ్ఞానమే ఉంటే ముందు జాగ్రత్తతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి దండం పెట్టి కాంగ్రెసు పార్టీలోనే కొనసాగే వారన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అయి ఉండేవారన్నారు. వచ్చే ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును జగన్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలు సమం చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

కాగా ఎమ్మార్ ప్రాపర్టీలో భూములు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని, వారికి నష్టపరిహారంగా భూమికి భూమి ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. గచ్చిబౌలిలోని ఎమ్మార్ ప్రాపర్టీలో జరుగుతున్న గోల్ఫ్‌క్రీడలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్ బాధితులతో కలసి ఆదివారం ఎమ్మార్ విల్లాస్‌ను ముట్టడించేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నారాయణ, అయన అనుచరవర్గాన్ని, బాధితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సొంత పూచికత్తుపై సాయంత్రం వదిలేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+