ఉప ఫలితాలతో ఢిల్లీకి అర్థం కావాలి: వైయస్ జగన్

రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. మూడో పార్టీ గానీ మూడో వ్యక్తి ఉండకూడదని ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రైతుల కోసం తమ శానససభ్యులు రాజీనామాలు చేశారని, ఉప ఎన్నికలు వస్తే మంత్రులు వస్తారు, డబ్బుల మూటలు పంచుతారని తెలిసి కూడా ఎన్నికలకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఖాళీ అయిన 17 స్థానాలకు ఇంచార్జీలను త్వరలో నియమిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications