జూ.ఎన్టీఆర్‌కు అనుభవం లేదు, ఫ్యూచర్ ఉంది: హరికృష్ణ

కాగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన, పార్టీకి అవసరమైనప్పుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ సేవలు తాము వినియోగించుకుంటామని అన్నారు. తాను కాని తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ తెలుగుదేశం పార్టీకి దూరం కాలేదన్నారు. తాను క్రియాశీలకంగా ఉన్నానని, జూ.ఎన్టీఆర్ పార్టీకి అవసరమైనప్పుడు వస్తాడని అన్నారు. నారా - నందమూరి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు. గతంలో తన సోదరుడు, హీరో బాలకృష్ణ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయన్నారు. పార్టీ కోసం అందరం కలసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. మా కుటుంబంలో మూడో తరానికి చెందిన జూ.ఎన్టీఆర్‌ను కూడా ప్రజలు ఆదరించి అభిమానిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications