అతను స్త్రీలపై వరుస దాడులు చేస్తున్న సైకో కాడు

మరణించిన యువకుడి ఛాయాచిత్రాన్ని పోలీసులు మహిళలకు చూపించారు. అయితే, తమపై దాడి చేసిన యువకుడు అతను కాదని మహిళలు చెప్పినట్లు సమాచారం. మహిళలపై దాడి చేశాడని ఆరోపిస్తూ శనివారంనాడు పెదవడ్లపూడి గ్రామంలో స్థానికులు ఓ యువకుడిని చితకబాదారు. ఆ దెబ్బలకు అతను మరణించాడు. హత్యకు గురైన ఈ యువకుడిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరణించిన యువకుడు వచ్చీ రాని హిందీలో మాట్లాడాడని, అతను ఒరిస్సాకు సంబంధించినవాడై ఉండవచ్చునని ఒఎస్‌డీ (ఉత్తరం) అన్నపూర్ణా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications