పెళ్లిని తిరస్కరించిందని అమెరికా యువతి దారుణహత్య

పెళ్లి ఇష్టం లేదని పైమానా అతడికి చెప్పింది. ఒక మత పెద్ద ద్వారా పైమానాకు నచ్చజెప్పేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే పైమానా అంగీకరించక పోవడంతో ఆమెకు, ఒమెద్‌కు తరుచూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి కూడా గొడవ అయింది. అప్పుడు ఒమెద్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. రాత్రి సుమారు గం.11.45 నిమిషాలకు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారు వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తర్వాత పైమానా స్నేహితురాలు తెలిపిన సమాచారంతో ఒమెద్ నే నిందితుడిగా భావించి దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ తనిఖీ కేంద్రాలను అప్రమత్తం చేశారు. నిందితుడు ఆదివారం విమానాశ్రయం నుండి ఆఫ్ఘనిస్తాన్ పారిపోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు, అక్కడకు చేరుకొని అతన్ని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications